26 సెప్టెంబర్ 2018 బుధ‌వారం మీ రాశి ఫలాలు

Wed,September 26, 2018 06:08 AM

26 september 2018 wednesday your horoscope

మేషం

ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటు ంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మానసిక ప్రశాంతతకు శివారాధన చేయటం మంచిది.

వృషభం

చాలా ఆహ్లాదకరమైన రోజు. ఎక్కువగా ఇంటి వద్ద ఉంటూ ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం, అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. రోజు చివరలో అనుకోని ప్రయాణంకాని, ఆశ్చర్యకరమైన సంఘటన కాని చోటు చేసుకుంటుంది.

మిథునం

ఈరోజు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితం ఏర్పడుతుంది. గృహసంబంధ లావాదేవీలు, వాహన కొనుగోలు వ్యవహారాలు పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.

కర్కాటకం

ఈరోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అనుకోని ప్రయాణం చేస్తారు. అలసట, నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఆర్థిక వ్యవహారాలకు అనుకూలమైన రోజు కాదు. అనుకోని ఖర్చులుంటాయి.

సింహం

ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగడం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. సమస్యలు తగ్గటానికి హనుమాన్ ఆరాధన చేయండి మేలు చేస్తుంది.

కన్య

మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వాహన కొనుగోలు కాని, మరమ్మతు కాని చేస్తారు. మీ పని వారి విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. ఉత్సాహంగా ఉంటారు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారం పూర్తి చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

వృశ్చికం

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ చాలా అవసరం.

ధనుస్సు

ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయట భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబసభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు.

కుంభం

ఈ రోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చినా పట్టు వదలక వాటిని పూర్తి చేస్తారు. అతిగా శ్రమించాక తగినంత విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఇష్టం లేని వారితో అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మిత్రులను కలుస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పోయింది అనుకున్న డబ్బు తిరిగి వస్తుంది.

మీనం

ఈరోజు అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కనిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కాని, సహాధ్యాయులను కాని కలుసుకుంటారు.

14542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles