21 జనవరి 2019 సోమ‌వారం మీ రాశి ఫలాలు

Mon,January 21, 2019 06:01 AM

21st january 2019 monday horoscopes details

మేషం

మేషం : పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక ైస్థెర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది.

వృషభం

వృషభం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం

మిథునం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాసముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్ కు అనుకూలం.

సింహం

సింహం : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కన్య

కన్య : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

తుల

తుల : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతా యి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విదేశీసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు..

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలగి పోతాయి. మీ భాగస్వామి నుంచి సహాయం అందుకుంటారు.

కుంభం

కుంభం : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. ఆర్థిక సంబంధ లావాదేవీలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. ఆచితూచి అడుగేయటం మంచిది.శత్రువు బాధ తొలగి పోతుంది.

మీనం

మీనం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువుల కారణంగా లేదా వాహన కారణంగా డబ్బు ఖర్చవుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూలంగా ఉంటుంది.

10824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles