102 నాటౌట్ మూవీ ట్రైలర్ విడుదల

Wed,March 28, 2018 03:10 PM

102 Not Out  Official Trailer

ఉమేష్ శుక్లా తెరకెక్కిస్తున్న కామెడీ డ్రామా 102 నాటౌట్ . అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల కానుంది. గుజరాతీ డ్రామా `సౌమ్య జోషి` రచించిన నాటకం స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ 102 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనుండగా, రిషి కపూర్ 72 ఏళ్ళ కొడుకు పాత్రలో కనిపించనున్నాడు. 27 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ట్రిటాప్ ఎంటర్టైన్మెంట్- బెంచ్ మార్క్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని నిర్మిస్తున్నాయి.

102 నాటౌట్ చిత్రంలో అమితాబ్ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 118 ఏళ్ళ చైనీస్ పర్సన్ ని రికార్డ్ బ్రేక్ చేయాలని అమితాబ్ తపనపడుతుంటే, అతని కొడుకుగా నటిస్తున్న రిషి కపూర్ తన తండ్రి అంత యాక్టివ్ గా తాను లేనని ఒప్పుకుంటాడు. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘నసీబ్’, ‘కభీ కభీ’, ‘కూలీ’ తదితర విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్ లో గుడ్డులో నుండి రిషీ కపూర్ బయటకి వస్తున్నట్టు కనిపిస్తుండగా, బాప్ కూల్.. బేటా ఓల్డ్ కూల్ అనే క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles