
కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్‌పై ఆదేశ మాజీ సుందరి యాజ్మిన్ ఫిర్యాదు
కోస్టారికా, ఫిబ్రవరి 9: కోస్టారికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆస్కార్ ఆరియస్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆ దేశ మాజీ సుందరి యాజ్మిన్ మొరేల్స్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్కార్ ఆరియస్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. దీంతో 2015లో సాన్ జోస్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు నాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. తెలిసిన వాళ్లు కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని యాజ్మిన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆస్కార్ ఆరియస్ స్పందిస్తూ తాను ఎవరిపైనా లైంగికదాడికి పాల్పడలేదని చెప్పారు. తన కెరీర్లో లింగసమానత్వం కోసం పోరాడానని తెలిపారు. కాగా ఆస్కార్ ఆరియస్ 1986-90, 2006-10 మధ్య రెండు సార్లు కోస్టారికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆస్కార్ ఆరియస్కు వ్యతిరేకంగా ప్రజలు రోడెక్కారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్కార్ రేపిస్ట్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.