ప్రపంచ వృద్ధురాలు వయోలెట్ కన్నుమూత

Wed,September 20, 2017 01:04 AM

World s Oldest Person Violet Mosse-Brown Dies Aged 117

Violet-Brown
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు వయోలెట్ మోసీ బ్రౌన్(117) మరణించారు. బ్రిటిష్ రాణి విక్టోరియా పాలన కాలంలో ఆమె పుట్టారు. మార్చి 10, 1900లో జన్మించిన ఆమెకు ఈ ఏడాది జూలై నాటికి 117 ఏండ్ల 139 రోజుల వయస్సు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ నెల 15న అనారోగ్య సమస్యలతో వయోలెట్ మరణించారు. వయోలెట్‌కు మొత్తం ఏడుగురు సంతానం. ఆమె పెద్ద కుమారుడు హర్లాండ్ ఫేర్‌వెదర్(96) గత ఏప్రిల్‌లో చనిపోయారు. ఇద్దరి వయస్సును కలిపి లెక్కించగా 213 ఏండ్ల 345రోజులు జీవించిన తల్లీకొడుకులుగా రికార్డు సృష్టించారు. ఎక్కువకాలం జీవించడానికి గల ఆరోగ్య రహస్యమేమిటని గతంలో వయోలెట్‌ను పలువురు ప్రశ్నించగా.. తాను చికెన్, పంది మాంసం మినహా మిగతావన్నీ తింటానని, మద్యం మాత్రం తాగనని చెప్పారు.

182

More News

VIRAL NEWS