ప్రపంచమంతా భారత్‌నే నమ్ముతున్నది!

Sat,September 14, 2019 01:00 AM

World doesn't believe us on Kashmir issue admits Pak minister

- మా మాటల్ని ఎవరూ నమ్మడం లేదు: పాక్ మంత్రి ఇజాజ్ వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కశ్మీర్ అంశంలో యావత్ ప్రపంచం భారత్ వాదననే సమర్థిస్తున్నదని.. పాకిస్థాన్‌ను ఎవరూ నమ్మడం లేదని ఇజాజ్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. మందులు లేకుండా కశ్మీరీలు ఇబ్బందులు పడుతున్నారు.. అని మేము(పాక్) చెబుతూనే ఉన్నాం. కానీ, మా మాటల్ని ఎవరూ నమ్మడం లేదు. ప్రపంచమంతా భారత్‌నే విశ్వసిస్తున్నది అని ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles