భారత్ అభ్యంతరాలను పరిష్కరిస్తాం: చైనా

Wed,November 6, 2019 12:39 AM

బీజింగ్: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈపీ)పై భారత్ లేవనెత్తిన అభ్యంతరాల పరిష్కారానికి కృషి చేస్తామని చైనా మంగళవారం తెలిపింది. భారత్ లేవనెత్తిన అంశాలపై పరస్పర అవగాహనతో పరిష్కార మార్గాలు చూపాలన్న వైఖరిని సూత్రప్రాయంగా అనుసరిస్తామని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా కూటమిలోకి భారత్‌కు స్వాగతం పలుకాలని భావిస్తున్నట్లు పేర్కొంది. చైనా సారథ్యంలోనే ఆర్సీఈపీ రూపుదిద్దుకున్నది. సోమవారం 16 ఆగ్నేయాసియా దేశాల కూటమి ఏషియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఆర్సీఈపీ సూత్రాలను అంగీకరిస్తున్నా అందులో ప్రాథమిక స్ఫూర్తి కొరవడినందున ఈ ఒప్పందంలో భాగస్వామ్యం కాబోవడం లేదని ప్రకటించారు.

617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles