నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచయుద్ధమే

Thu,October 11, 2018 01:30 AM

Will cause third World War if I join politics Indra Nooyi

- దాపరికంలేకుండా మాట్లాడటమే అందుకు కారణం
- పెప్సీ మాజీ సీఈవో ఇంద్రానూయి

న్యూయార్క్: ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే.. అదే మూడో ప్రపంచయుద్ధానికి కారణమవుతుందని పెప్సీ కంపెనీ మాజీ సీఈవో, భారతసంతతి మహిళ ఇంద్రానూయి చమత్కరించారు. నిష్కపటంగా మాట్లాడే తన ధోరణే అందుకు కారణమని చెప్పారు. 62 ఏండ్ల ఇంద్రానూయికి ఏసియా సొసైటీ అనే సంస్థ మంగళవారం గేమ్ చేంజర్ ఆఫ్ ది ఈయర్ అవార్డ్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా అవార్డు ప్రదాన వేడుకలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఇంద్రానూయి సమాధానాలిచ్చారు. సీఈవో పదవి నుంచి దిగిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్యాబినెట్‌లో చేరొచ్చుగా అని ప్రశ్నించగా.. నాకు రాజకీయాలు సరిపోవు. దాపరికంలేకుండా మాట్లాడుతాను. కనీసం దౌత్యం గురించి కూడా తెలియదు. ఇవన్నీ తెలియవు కాబట్టే నా కారణంగా మూడో ప్రపంచయుద్ధం రావొచ్చు అని ఆమె చమత్కరించారు. 40 ఏండ్లుగా రోజూ 18-20 గంటలు పనిచేసేదాన్ని అని తెలిపారు. పనికి మించి జీవితం కూడా ఉన్నదని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. పుస్తకాలు రాయడం, ప్రపంచమంతా తిరిగి పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడంపై చర్చించేందుకు ఇప్పుడిక సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS