పాక్ సైన్యాధిపతి నోట ప్రజాస్వామ్యం

Sat,September 8, 2018 01:45 AM

Will avenge border deaths Pakistan warns India after US snub

-దానితోనే దేశ ప్రగతి: జనరల్ బాజ్వా
-కశ్మీర్‌లో స్వయంపరిపాలనా పోరుకు మద్దతునిస్తామని వెల్లడి
-ఏ దేశంతో యుద్ధానికి వెళ్లం: ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 7: దేశంలో అభివృద్ధి, ప్రగతి కోసం ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించడం తప్పనిసరని పాకిస్థాన్ సైనికాధిపతి ఖమర్ జావెద్ బాజ్వా పేర్కొన్నారు. గురువారం రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో స్వయంపాలన కోసం జరిగే పోరాటానికి మద్దతు ఉంటుందని బాజ్వా చెప్పారు. 1965, 1971 యుద్ధ్ధాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. సైన్యం, ప్రభుత్వం మధ్య ఎటువంటి విభేదాల్లేవని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. జాతి ప్రయోజనాలే ప్రధానంగా తన ప్రభుత్వ విదేశాంగ విధానం ఉంటుందని, ఏ దేశంతోనూ యుద్ధానికి దిగబోమన్నారు.

త్వరలో కర్తార్‌పూర్ సరిహద్దు ప్రారంభం?

వీసాలు లేకుండానే కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించేందుకు కర్తార్‌పూర్ వద్ద సరిహద్దును భారతీయ సిక్కు యాత్రికులకు తెరుస్తామని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి చెప్పారు.

746
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles