కాలిఫోర్నియా వైన్‌కంట్రీలో కార్చిచ్చు


Wed,October 11, 2017 03:25 AM

- 11 మంది మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
- సురక్షిత ప్రాంతాలకు తరలిన ప్రజలు
Calif
శాంటారోసా, అక్టోబర్ 10: అమెరికాలోని కాలిఫోర్నియా వైన్‌కంట్రీలో భారీగా మంటలు చెలరేగడంతో 11 మంది మృత్యువాత పడగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బలమైన గాలులుతో కూడిన మంటలు నలుదిశలా వ్యాపించడంతో 1500 ఇండ్లు కాలిపోయాయి. వ్యాపార సముదాయాలు, కిరాణ దుకాణాలు, రిసార్టులు, వైన్‌కంట్రీ చుట్టుపక్కల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయ్యాయి. వేలమంది స్థానిక ప్రజలు సురక్షితప్రాంతాలకు తరలిపోయారు. రెండురోజుల కిందట ప్రారంభమైన మంటలు తీవ్రరూపం దాల్చాయని, గంటకు 50 మైళ్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పేలుళ్లు సంభవించినట్టుగా మంటలు చెలరేగాయని కాలిఫోర్నియా అగ్నిమాపక, అటవీశాఖ డైరెక్టర్ కెన్ పెమ్లోట్ పేర్కొన్నారు. 14 చోట్ల భారీగా చెలరేగిన మంటలు శాన్‌ఫ్రాన్సిస్కో ఉత్తర దిక్కుగా నాపా పట్టణం నుంచి రెడ్డింగ్ పట్టణం వరకు 200 మైళ్ల మేర విస్తరించాయని తెలిపారు. కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ నాపా, సొనోమా, యూబా తదితర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో అక్టోబర్ నెలలో అగ్నిప్రమాదాలు సాధారణమే అయినప్పటికీ ఒకేసారి చాలాచోట్ల మంటలు చెలరేగడం విధ్వంసానికి కారణమైందని అధికారులు వెల్లడించారు.

213

More News

VIRAL NEWS