ఈ దశాబ్దంలో రికార్డుస్థాయి వేడిమి

Mon,February 11, 2019 01:13 AM

Warning of hottest decade in recorded history as record temperatures

-వాతావరణ శాస్త్రవేత్తల అంచనా

లండన్, ఫిబ్రవరి 10: వాతావరణ మార్పుల వల్ల భూగోళం రోజు రోజుకూ వేడెక్కుతున్నదని పదేపదే హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు.. ఈ దశాబ్దం (2014-23) గత 150 ఏండ్లలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వేడిమితో ముగుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రానున్న ఐదేండ్లలో ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత ప్రీ-ఇండస్ట్రియల్ లెవెల్స్ (పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయి) కంటే ఒక సెల్సియస్ డిగ్రీ ఎక్కువగా ఉంటుందని వారు అంచనా వేశారు. 2018లో ప్రంపంచ వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలతోపాటు వివిధ వర్గాల నుంచి లభించిన డేటాను ఆధారంగా చేసుకుని బ్రిటన్ వాతావరణశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 1850లో ప్రపంచ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2015లో తొలిసారి ప్రీ-ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే ఒక సెల్సియస్ డిగ్రీ ఎక్కువగా నమోదైన వార్షిక సగటు ఉష్ణోగ్రతలు.. ఆ తర్వాత వరుసగా మూడేండ్లపాటు దాదాపు అదే స్థాయిలో కొనసాగాయని బ్రిటన్ వాతావరణశాఖలో దీర్ఘకాలిక అంచనాల విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్న ఆడమ్ స్కయ్‌ఫీ వివరించారు. ఇప్పటి నుంచి 2023 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలోనే కొనసాగుతాయని, దీంతో గత 150 ఏండ్లలో ఎన్నడూ లేనంత వేడిమి ఈ దశాబ్దంలో ఉంటుందని తెలిపారు.

1320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles