వన్నాక్రైకి విరుగుడుగా వనాకివి


Sat,May 20, 2017 01:20 AM

-ఫైళ్లను కాపాడే కోడ్ కనిపెట్టిన ఫ్రెంచ్ పరిశోధకులు
పారిస్, మే 19: వన్నాక్రై వైరస్‌ను ఎలాంటి చెల్లింపులు జరుపకుండానే అన్‌లాక్ చేసే మార్గాన్ని ఫ్రెంచ్ పరిశోధకులు కనిపెట్టారు. వన్నాక్రై ర్యాన్‌సమ్‌వేర్ దాడికి గురైన విండోస్ ఫైల్స్‌ను కాపాడే చిట్టచివరి అవకాశంగా వారు దీనిని అభివర్ణిస్తున్నారు. పలువురు పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అవిశ్రాంతంగా కృషి చేసి వనాకివి అనే డిక్రిప్షన్ కోడ్‌ను సిద్ధం చేశారు. వన్నాక్రై దాడిచేసే విండోస్ 7 లేదా అంతకంటే పాతవైన ఎక్స్‌పీ, 2003 వెర్షన్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.

244
Tags

More News

VIRAL NEWS