వెనిజులా జైల్లో ఘర్షణ29 మంది ఖైదీల మృతి

Sun,May 26, 2019 01:31 AM

Venezuelan prison clashes leave 29 inmates dead

-19 మంది పోలీసులకు గాయాలు
కారకస్: ఉత్తర వెనిజులలోని ఓ జైల్లో శుక్రవారం చోటుచేసుకున్న ఘర్షణలో సుమారు 29 మంది ఖైదీలు మృతిచెందినట్టు, మరో 19 మంది పోలీసులు కూడా గాయపడినట్ట్టు అధికారులు తెలిపారు. పోర్చుగౌస రాష్ట్రం అకరిగువాలోని పోలీస్‌స్టేషన్ జైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో ఖైదీలు జైలును బద్దలుకొట్టి పారిపోయేందుకు యత్నించగా పోలీస్ స్పెషల్ ఫోర్స్ వారిని అడ్డుకొనే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో 29 మంది ఖైదీలు చనిపోయినట్టు పోర్చుగౌస పబ్లిక్ సెక్యూరిటీ కార్యదర్శి ఆస్కార్ వలెరో తెలిపారు. అధికారుల నుంచి ఖైదీలు ఆయుధాలను లాక్కుకొనే క్రమంలో మూడు గ్రెనేడ్లు పేలడంతో 19 మంది పోలీసులు గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. వెనిజులా జైళ్లలో 2011 నుంచి ఇప్పటివరకు సుమారు 400 పైచిలుకు ఖైదీలు మృతిచెందారు.

378
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles