రాష్ట్రపతి, ప్రధానికి అసాధారణ భద్రత

Fri,February 8, 2019 12:52 AM

-రెండు క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా సంసిద్ధత
వాషింగ్టన్, ఫిబ్రవరి 7: రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నతస్థాయి ప్రముఖుల గగనతల భద్రతకు సంబంధించి రెండు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదముద్ర వేసింది. రెండు బోయింగ్ 377-ఈఆర్ విమానాలతో కలిసి మొత్తంగా రూ.1,356 కోట్లతో భారత్ వీటిని కొనుగోలు చేయనున్నది. తద్వారా రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలకు అసాధారణ భద్రతను కల్పించనున్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాల్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్‌పీఎస్) అనే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్-377 విమానాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్‌లో రాష్ట్రపతి, ప్రధాని విదేశీ పర్యటనలను ఎయిరిండియా వన్ నిర్వహిస్తున్నది. వీటి భద్రతపై అనేక అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి రెండు బోయింగ్ 377-ఈఆర్ విమానాలను కొనుగోలు చేసి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను వాటికి అనుసంధానం చేయనున్నారు. వీటిలో ఉండే సెన్సార్లు ఉగ్రవాదుల దాడి ముప్పును ముందే గ్రహించి అప్రమత్తం చేస్తాయి. విధ్వంసక క్షిపణుల్ని నిర్వీర్యం చేస్తాయి.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles