డోక్లాంపై పరిణతి ప్రదర్శిస్తున్న భారత్


Sun,August 13, 2017 12:34 AM

-అమెరికా రక్షణ రంగ నిపుణుడు హోల్మెస్ ప్రశంస
వాషింగ్టన్, ఆగస్టు 12: డోక్లాం వివాదంలో చైనాతో భారత్ పూర్తి పరిణతితో వ్యవహరిస్తున్నదని అమెరికా రక్షణ రంగ నిపుణుడు జేమ్స్ ఆర్ హోల్మెస్ వ్యాఖ్యానించారు. చైనా మాత్రం అనవసర దూకుడు ప్రదర్శిస్తున్నదన్నారు. అమెరికా నావికా యుద్ధ కళాశాల వ్యూహాత్మక విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జేమ్స్ ఆర్ హోల్మెస్ భారత్ వైఖరిని ప్రశంసించారు. డోక్లాం ముక్కోణ జంక్షన్‌లో చైనా సైనికులు రోడ్డు నిర్మాణం చేపట్టకుండా భారత సైన్యం అడ్డుకోవడంతో రెండు దేశాల మధ్య 50 రోజులుగా ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వివాదం కొనసాగాలని చైనా కోరుకుంటే అసాధారణ పరిస్థితులకు దారి తీస్తుందని హోల్మెస్ వ్యాఖ్యానించారు. ఒకవేళ దృఢమైన సముద్ర తీర వ్యూహం అమలు చేయాలని చైనా కోరుకుంటే తన భూభాగంపై సరిహద్దులను కాపాడుకోవాలని అప్పుడు పొరుగు దేశాలు ఆక్రమించాయన్న ఆందోళన ఉండదని ఆయన స్పష్టం చేశారు.

559

More News

VIRAL NEWS