హెచ్-4 వీసాదారులకు ఊరట

Mon,November 11, 2019 01:31 AM

-పని అనుమతులను పునరుద్ధరించిన కోర్టు
-వేలాది మంది భారతీయులకు లబ్ధి

వాషింగ్టన్, నవంబర్ 10: అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది. హెచ్-4 వీసాదారు లు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబి యా సర్క్యూట్ కోర్టు అనుమతినిచ్చింది. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తూ, వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులను రద్దుచేశారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ కొలంబియా సర్క్యూట్స్‌లో దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.ఈ కేసులో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టుకు సూచించింది. దీంతో హెచ్-4 వీసాదారులకు పని అనుమతులను పునరుద్ధరించినట్టయింది. అమెరికాలో 1.2 లక్షల మంది హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా.

395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles