ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బాంబు దాడులు..

Thu,October 10, 2019 01:09 AM

- 30 మంది మృతి
కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లకు చెంది న మాదక ద్రవ్యాల కేంద్రాలపై ఈ ఏడాది మే 5న అమెరికా జరిపిన బాంబు దాడుల వల్ల 30 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్‌ (యూఎన్‌ఏఎంఏ) తెలిపింది. ‘బాంబు దాడులపై దర్యాప్తు జరిపాం. 30 మంది పౌరులు చనిపోయారు’ అని పేర్కొంది. ఫర్హా రాష్ట్రంలోని బక్వా జిల్లాపై, నిమ్రోజ్‌ రాష్ట్రంలోని డెలారం జిల్లాపై ఈ దాడులు జరిగాయని వెల్లడించింది.

337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles