నామినేట్ చేసిన ఆంటోనియో గుటేరస్

Fri,August 10, 2018 02:50 AM

UN Secretary General Antonio Guterres nominates Chiles first woman president

-ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాచెలెట్!
-యూఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం లాంఛనమే

ఐక్యరాజ్య సమితి : చిలీ దేశ తొలి మహిళాధ్యక్షురాలు, ప్రఖ్యాత హక్కుల న్యాయవాది మిషెల్ బాచెలెట్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభా గం హైకమిషనర్ పదవికి నామినేట్ అయ్యారు. ఆ పదవికి 66 ఏండ్ల బాచెలెట్ పేరును ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ప్రతిపాదించారు. 193 సభ్యదేశాల ప్రతినిధులతో కూడిన జనరల్ అసెంబ్లీ ఆ ప్రతిపాదనను ఆమోదించాల్సి ఉంది. హక్కుల విభాగం హైకమిషనర్‌గా కొనసాగిన జోర్డాన్ దౌత్యవేత్త జియెద్ రాద్ అలహసన్ పదవీకాలం గతనెలలో ముగిసింది. మహిళా హక్కుల కార్యకర్తగా పేరుపొందిన బాచెలెట్.. సైనిక పాలకుల నిర్బంధాలను తట్టుకుని మరీ నిలదొక్కుకున్నారు. 2006లో చిలీ అత్యున్నత పదవికి ఆమె ఎన్నికయ్యారు. 2014లో రెండోసారి చిలీ అధ్యక్షురాలిగా ఎన్నికైన బాచెలెట్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసింది. 2010లో ఏర్పాటు చేసిన ఐరాస లింగసమానత్వవిభాగం కార్యనిర్వాహక డైరెక్టర్ పదవికి ఆమె ఎంపికయ్యారు.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS