జలియన్‌వాలాబాగ్ ఊచకోతపై క్షమాపణలు చెప్పాలి

Thu,February 21, 2019 01:16 AM

UK to Reflect on Demands for Apology on Jallianwala Bagh Massacre

-బ్రిటన్ పార్లమెంట్‌లో ఎంపీల డిమాండ్
లండన్: జలియన్‌వాలా బాగ్ మారణహోమం జరిగి 100 ఏండ్లు అయిన తరుణంలో నాటి వలస ప్రభుత్వమైన బ్రిటన్ బేషరతు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌లు ఊపందుకున్నాయి. బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)లో అమృత్‌సర్ ఊచకోత : శతాబ్దం పేరుతో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎంపీ బరోనెస్ అన్నాబెల్ గోల్డీ మాట్లాడుతూ.. భారత్‌లో బ్రిటిష్‌రాజ్ హయాంలో జరిగిన జలియన్‌వాలా బాగ్ విషాదానికి సరైన సమయంలో, గౌరవపూర్వక రీతిలో స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. నాటి దుశ్చర్యను అప్పటి బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది. అయితే, ఇప్పటివరకూ అధికారికంగా క్షమాపణలు చెప్పలేదు. ఈ మారణహోమం జరిగి 100 ఏండ్లు అయిన ప్రస్తుత తరుణంలో క్షమాపణలు చెప్పడానికి ఇదే సరైన సమయం అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles