బ్రిటన్ ప్రధాని థెరెస్సాకు పదవీ గండం?

Mon,March 25, 2019 02:08 AM

UK should leave or remain in the European Union

లండన్, మార్చి 24: ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోతే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని థెరెసా మేపై క్యాబినెట్ సహచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. వచ్చేవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే మూడో బ్రెగ్జిట్ బిల్లును ఉపసంహరించుకుంటే ప్రధానిగా వైదొలుగాలని ఆమె సహచర మంత్రులు, అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను ఖండించిన అధికార పార్టీ వర్గాలు.. క్యాబినెట్ ఆమెకు అండగా ఉన్నదని పేర్కొన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ చాన్స్‌లర్ ఫిలిప్ హమ్మండ్ స్పందిస్తూ ప్రధానుల మార్పుతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఈయూలో బ్రిటన్ సభ్యత్వం కొనసాగింపుపై పీపుల్స్ ఓట్ పేరిట మరో రెఫరెండం నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించొచ్చునన్నారు. బ్రెగ్జిట్‌పై మరో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో లక్షలాది మంది ప్రదర్శనలు జరిపారు.

582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles