థెరెసా మే రాజీనామా

Sat,June 8, 2019 02:23 AM

UK PM Theresa May resigns as party leader

- పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్న బ్రిటన్ ప్రధాని

లండన్, జూన్ 7: బ్రెగ్జిట్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైన నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని రెండు వారాల కిందట ప్రకటించిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బ్యాక్‌బెంచ్ 1922 కమిటీకి ఆమె రాజీనామా సమర్పించారు. పార్టీ సారథిగా మరొకరిని ఎన్నుకునేంత వరకు ఆమె ప్రధానిగా కొనసాగనున్నారు. విదేశాంగ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సస్ సహా 11 మంది ఈ పదవికి పోటీపడుతున్నారు. విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్, పర్యావరణ కార్యదర్శి మైఖెల్ గోవ్ కూడా ముందంజలో ఉన్నారు. జూలై మూడో వారంలో విజేతను ప్రకటించే అవకాశం ఉన్నది. 2016 జూన్‌లో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం అనంతరం నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన థెరెసా మే.. సుమారు మూడేండ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బ్రెగ్జిట్‌పై గడువు అక్టోబర్ 31తో ముగియనుండడంతో.. ఆ లోపు ఒప్పందాన్ని కొలిక్కి తేవడం కొత్త సారథికి సవాలే.

210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles