రెండోసారి కెన్యా అధ్యక్షుడిగా కెన్యట్టా ఎన్నిక


Sun,August 13, 2017 12:37 AM

నైరోబి: కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. కెన్యట్టాకు 54.27 శాతం ఓట్లు వచ్చాయని, ఆయన ప్రత్యర్థి రయిలా ఒడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం చైర్మన్ వాఫులా చెబుకట్టి ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు కెన్యట్టా మద్దతుదారులు సంబురాల్లో మునిగిపోయారు. కానీ ఓటమి పాలైన రయిలా ఒడింగా మాత్రం ఎన్నికలను తిరస్కరించారు. అధికార పక్షం రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు.

236

More News

VIRAL NEWS