యునెస్కో నుంచి వైదొలిగిన అమెరికా


Fri,October 13, 2017 12:56 AM

-సంస్థలో ఇజ్రాయెలీ వ్యతిరేకత పెరిగిందని ఫిర్యాదు
వాషింగ్టన్, అక్టోబర్ 12: ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి యునెస్కోలో మితిమీరిపోయిందని, సంస్థలో మౌలిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అమెరికా ఈ సందర్భంగా పేర్కొన్నది. 2018 డిసెంబర్ 31 నుంచి ఉపసంహరణ అమలులోకి వస్తుందని, అంతవరకు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కొనసాగిస్తామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి హీదర్ నాయర్ట్ తెలిపారు. ఇది అంత తేలికగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. ఈమేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవాకు అమెరికా విదేశాంగశాఖ లేఖ రాసింది.

202

More News

VIRAL NEWS