కిమ్‌ను దారికెలా తెద్దాం?


Thu,October 12, 2017 01:56 AM

-రక్షణ సలహాదారులతో ట్రంప్ మంతనాలు
-కొరియా ద్వీపకల్పంపై మళ్లీ యుద్ధవిమానాలు చక్కర్లు
US-Air-Force
వాషింగ్టన్, అక్టోబర్ 11 : ఉత్తరకొరియాను ఎలా దారికి తేవాలనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రక్షణ సలహాదారులు, అధికారులతో సమావేశమయ్యారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్, స్టాఫ్‌జనరల్ సంయుక్త అధిపతుల చైర్మన్ జోసెఫ్ డన్‌ఫోర్డ్‌లతో చర్చలు జరిపారు. అణ్వాయుధాలతో బెదిరింపులకు దిగుతున్న ఉత్తరకొరియా మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునన్న అంశంపై వారు చర్చించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరకొరియాను దారికి తెచ్చేందుకు 25 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నాం. వందల కోట్లు ఖర్చుచేశాం. అయినా ఆ దేశం తన పాతబుద్ధినే ప్రదర్శిస్తున్నది. చర్చల ప్రక్రియనే వారు అపహాస్యం చేసేశారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క మార్గం మిగిలింది అని అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు కొరియా ద్వీపకల్పంపై అమెరికాకు చెందిన రెండు బీ-1బీ విమానాలతోపాటు దక్షిణ కొరియాకు చెందిన రెండు ఫైటర్ జెట్ విమానాలు చక్కర్లు కొట్టాయి. జపాన్, దక్షిణ కొరియాతో కలిపి సంయుక్త సైనిక విన్యాసాలు జరిపినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది.

358

More News

VIRAL NEWS