లండన్ మెట్రో పేలుళ్ల కేసులో మరో ఇద్దరి అరెస్టు


Thu,September 21, 2017 12:11 AM

లండన్: లండన్ మెట్రోలో బకెట్‌బాంబు దాడి కేసుకు సంబంధించి మరో ఇద్దర్ని బ్రిటీష్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 30 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అరెస్టులతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య ఐదుకు చేరింది. సౌత్‌వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన స్కాట్లాండ్ యార్డ్స్ కౌంటర్ టెర్రరిజం కమాండ్‌కు చెందిన పోలీసులు ఈ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగంగా కొనసాగిస్తున్న పోలీసులు.. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. దాడికి గల కారణాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు లోతుగా విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

130

More News

VIRAL NEWS