2020లో ట్రంప్‌తో పోటీపడతా!

Sun,January 13, 2019 01:56 AM

Tulsi Gabbard announces 2020 run for president against Trump

-నిర్ణయాన్ని ప్రకటించిన తులసీ గబ్బార్డ్
-అమెరికా అధ్యక్ష రేసులో తొలిసారిగా హిందూ మహిళ

వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీపడనున్నారు. హవాయి నుంచి అమెరికా ప్రతినిధుల సభకు డెమొక్రటిక్ పార్టీ తరుఫున వరుసగా నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసీ గబ్బార్డ్ (37) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలపడనున్నట్లు శనివారం ఆమె ప్రకటించారు. తద్వారా అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర లిఖించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాల్ని వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు సెనెటర్ ఎలిజబెత్ వారెన్ ఇప్పటికే ప్రకటించారు. మరో 12 మంది అభ్యర్థులు సైతం పోరుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ కమలా హ్యారిస్ ఒకరు. ఇరాక్ యుద్ధం సమయంలో హవాయి ఆర్మీ నేషనల్ గార్డు నెలకొల్పిన మెడికల్ క్యాంప్‌లో ఏడాదిపాటు తులసీ గబ్బార్డ్ సేవలందించారు. 21 ఏండ్ల అతి చిన్న వయస్సులోనే ప్రతినిధుల సభకు ఎంపికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీపడనున్న తొలి హిందూ మహిళగా నిలువనున్నారు. ఇండో అమెరికన్లలో తులసీ ప్రఖ్యాత నేతగా పేరుగాంచారు.

1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles