కిమ్.. నా కారు చూడు!

Wed,June 13, 2018 07:04 AM

Trump shows Kim Jong Un presidential limousine

presidential-vehicle
సింగపూర్: నిన్నటిదాకా కత్తులు దూసుకున్న భిన్న మనస్తత్వాలు గల ఇద్దరు దేశాధినేతలు సింగపూర్ భేటీ సందర్భంగా కెపెల్లా హోటల్‌లోని పచ్చికబయళ్లలో చెట్టపట్టాలేసుకొని కలియదిరిగారు. ఆ సమయంలోనే అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు ఎన్నో ప్రత్యేకతలున్న తన వాహనం బీస్ట్‌ను దగ్గరుండి చూపించారు. అమెరికా అధ్యక్షుడి వాహనం బీస్ట్‌కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా పేరుంది. ఎనిమిది టన్నుల బరువుండే బీస్ట్ రసాయన దాడులను కూడా తట్టుకుంటుంది. ఆ కారు వద్దకు రాగానే ట్రంప్ కనుసైగను గుర్తించిన ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వెంటనే వాహనం తలుపులు తెరిచాడు. సాధారణంగా ఇతరులెవరనీ ఆ వాహనం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. కానీ కిమ్ కారులోపలి భాగాలన్నీ చూడటమే కాకుండా, దాని ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నారు. ఆ వాహనం వెలుపలి భాగం ఎనిమిది అంగుళాల మందంతో ఉంటుంది. ఐదు అంగుళాల మందంతో దాని అద్దాలు ఎంతటి శక్తిమంతమైన బుల్లెట్‌నైనా లోపలికి రానివ్వవు. బోయింగ్ 757 విమానానికి ఉండే తలుపులను పోలి ఉండే వాటిని ఈ వాహనానికి అమర్చారు. పంక్చర్‌లను తట్టుకునే కెవ్లార్ టైర్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాన్ని ముందుకు తీసుకెళతాయి. ఎటువంటి పేలుడునైనా తట్టుకొనే మూతను ఇంధనం ట్యాంక్‌కు అమర్చారు.

3611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles