అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో సైన్యం కవాతు

Sat,July 6, 2019 03:02 AM

Trump praises US military in rare Independence Day speech

వాషింగ్టన్, జూలై 5: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సైనిక దళాల ప్రదర్శనలో గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. దాదాపు 70 సంవత్సరాల విరామం తరువాత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా సైనికుల ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా సైన్యంలో సేవలందిస్తూ, దేశ సమగ్రతను పరిరక్షిస్తున్న అత్యంత ధైర్యవంతులైన స్త్రీ, పురుష సైనికులందరికీ తాను వందనం చేస్తున్నానని అన్నారు. ఈరోజు మనమందరం ఒకదేశంగా కలిసి ఉన్నాం. దేశ సమగ్రతను పరిరక్షిస్తున్న అత్యంత ధైర్యవంతులైన స్త్రీ, పురుష సైనికులందరికీ వందనాలు అని అన్నారు. దేశ సైనిక బలగాల ధైర్యసాహసాల మూలంగా ప్రపంచ చరిత్రలోనే అమెరికా అసాధారణమైన దేశంగా నిలిచిందని, గతంతో పోలిస్తే తమ దేశం మరింత శక్తిమంతంగా మారిందని ఆయన తెలిపారు. కాగా అమెరికా జాతీయ దినోత్సవాన్ని, సైనిక విన్యాసాలను ట్రంప్ రాజకీయం చేయడంపై ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles