80 ఏండ్ల నాటి బల్ల సాక్షిగా..

Wed,June 13, 2018 02:46 AM

Trump Kim meet 80 year old Singapore Supreme Court table used for historic summit

Designedin1939
సింగపూర్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల చారిత్రక శిఖరాగ్ర భేటీలో సింగపూర్ సుప్రీంకోర్టుకు చెందిన 80 ఏండ్ల నాటి ఒక టేకు బల్ల కీలక పాత్ర పోషించింది. కెపెల్లా హోటల్‌లో జరిగిన ప్రతినిధుల స్థాయి భేటీలో ఇద్దరు అధినేతలతోపాటు వారి దేశాల ప్రతినిధులు ఈ చారిత్రక బల్ల వద్దనే సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు కోసం స్థానిక చేతివృత్తుల నిపుణులు 1939లో తయారుచేసిన 4.3 మీటర్ల పొడవున్న ఈ బల్లపైనే ట్రంప్, కిమ్ తమ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. సింగపూర్ నేషనల్ గ్యాలరీలోని మూడో అంతస్థులోగల ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో ఉండే బల్లను ఈ సమావేశం కోసమే అమెరికా రాయబార కార్యాలయం అద్దెకు తీసుకొచ్చింది.

1119

More News

VIRAL NEWS