సరిహద్దు గోడపై ట్రంప్ మొండిపట్టు

Mon,January 7, 2019 01:53 AM

Trump inclined to declare national emergency if talks continue to stall

వాషింగ్టన్, జనవరి 6: మెక్సికో సరిహద్దు వెంట గోడ కట్టాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెండిపట్టు పట్టారు. అది సిమెంట్ గోడగానీ, స్టీల్ గోడగానీ ఏదో ఒకటి కట్టి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుండగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం స్తంభించిన విషయం తెలిసిందే. ఆదివారం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ అమెరికాలోకి అక్రమ వలసలను నిరోధించాలన్నా, మత్తు పదార్థాలకు అడ్డుకట్ట పడాలన్నా గోడకట్టడమే పరిష్కారమని చెప్పారు. అనంతరం అధ్యక్షుడి రిసార్ట్ అయిన క్యాంప్ డేవిడ్‌కు ట్రంప్ వెళ్లారు. అక్కడ ఆయన అధికారులతో గోడ నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles