భారతీయ అమెరికన్‌కు కీలకపదవి

Wed,September 13, 2017 02:36 AM

Trump appointed Indian American Manisha Singh as economic diplomacy head

ఆర్థిక దౌత్య విధులను అప్పగిస్తూ నియమించిన ట్రంప్
Manisha-Singh
వాషింగ్టన్, సెప్టెంబర్ 12: అమెరికా దౌత్య కార్యాలయంలో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. న్యాయవాది మనీషాసింగ్‌కు స్టేట్ డిపార్టుమెంట్‌లో కీలకమైన పరిపాలన బాధ్యతలు, ఆర్థిక దౌత్య విధులను అప్పగించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మనీషాను నియమించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీషాసింగ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. సభ ఆర్థికవ్యవహారాలకు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న చార్లెస్ రివ్‌కిన్ స్థానంలో మనీషాసింగ్‌ను నియమించారని సెనేట్‌లో ముఖ్య కౌన్సిల్, సీనియర్ పాలసీ అడ్వయిజర్ డాన్ సులీవన్ నిర్ధారించారు. ఈ మేరకు సెనేట్‌కు సోమవారం నామినేషన్‌ను పంపారు. మనీషా బ్యూరో ఆఫ్ ఎకనామిక్, ఎనర్జీ, బిజినెస్ వ్యవహారాల విభాగాలకు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, విదేశీ సంబంధాల కమిటీకి సీనియర్ సహాయకురాలిగా పనిచేశారు.

457

More News

VIRAL NEWS