పసందైన వంటకాల ఘుమఘుమలు

Wed,June 13, 2018 12:58 AM

Trump and Kim Juice Recipes

సింగపూర్: ఎన్నో ప్రత్యేకతలకు, సంభ్రమాశ్చర్యాలకు వేదికగా మారిన ట్రంప్, కిమ్‌ల శిఖరాగ్ర భేటీలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ప్రజలకు ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడమే ఓ వింత కాగా, వారిద్దరు కలిసి మధ్యాహ్న భోజనం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు, ఉత్తరకొరియా అధినేత భోజనానికి కూర్చున్న బల్లపై పశ్చిమ, ఆసియా దేశాలకు చెందిన వంటకాలను వడ్డించారు. కొరియన్ మసాలా కూరిన కీర దోసకాయ, వేయించిన గోమాంసం పక్కటెముకలు, హాగెన్ డాజ్ ఐస్‌క్రీమ్‌లు వాటిలో ఉన్నాయి. సెంటోసా దీవిలోని కెపెల్లా హోటల్‌లో భేటీ అయిన ఇద్దరు దేశాధినేతలు తమ ప్రతినిధులతోపాటు మధ్యాహ్నం భోజనంలో మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరు నేతలు గదిలోకి ప్రవేశించగానే కెమెరాల ఫ్లాష్‌లైట్లు వెలుగులు చిమ్మాయి. తన అందమైన చిత్రాన్ని ఒకటి తనకివ్వాలని ట్రంప్ ఫొటోగ్రాఫర్లతో జోక్ చేశారు. విందులో స్టార్టర్లుగా రొయ్యల కాక్‌టెయిల్, అవొకాడో సలాడ్, పచ్చటి మామిడి కెరాబు, తాజా ఆక్టోపస్, కొరియన్ మసాలా కూరిన కీర దోసకాయను వడ్డించారు. మెయిన్ కోర్సులో వేయించిన గో మాంసం పక్కటెముకలు, ఆలుగడ్డ డౌఫోనియోస్, రెడ్‌వైన్ సాస్, పంది మాంసం యాంగ్‌జౌ ఫ్రైడ్ రైస్, ముల్లంగితో కలిపి వడ్డించిన చేపలు ఉన్నాయి.

439
Tags

More News

VIRAL NEWS