జన్మతః పౌరసత్వం రద్దు!

Fri,August 23, 2019 03:26 AM

Trump Again Claims He Can Abolish Birthright Citizenship

-అక్రమ వలసల నిరోధానికి మరో చర్య
-ఆలోచిస్తున్నామన్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. అమెరికాలోకి అక్రమ వలసల నిరోధానికి కొత్తకొత్త మార్గాలను అ న్వేషిస్తున్న ఆయన.. అమెరికాలో పుట్టినవారికి జన్మహక్కుగా పౌరసత్వాన్ని కల్పించే విధానం హాస్యాస్పమని, ఆ విధానాన్ని రద్దుచేస్తామన్నారు. అమెరికాలో జన్మించినవారికి ఆటోమేటిక్‌గా ఆ దేశ పౌరసత్వాన్ని కల్పించే ఈ విధానం గురించి బుధవారం వైట్‌హౌస్ వెలుపల విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. పౌరసత్వం జన్మహక్కుగా ఉండ టం చాలా హాస్యాస్పదమైనది. ఈ విధానం గురించి మేము తీక్షణంగా ఆలోచిస్తున్నాం అని చెప్పారు. అమెరికాలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరులుగా మారే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని రద్దుచేస్తామని గతంలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిజ్ఞను ప్రతిధ్వనించేలా ఈ వ్యాఖ్యలు ఉ న్నాయి.

మా గడ్డ పై పుట్టిన ఇతర దేశస్థుల పిల్లలకు పౌరసత్వం జన్మహక్కు గా లభిస్తున్నది. సరిహద్దులు దాటివచ్చి మా దేశంలో పిల్లలను కంటున్నారు. దాంతో వారికి అమెరికా పౌరసత్వం లభిస్తున్నది. ఈ విధానంపై మేము చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాం అని అన్నారు. ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ విధానాన్ని రద్దుచేస్తానని హామీ ఇచ్చారు. పౌరసత్వం జన్మహక్కని అమెరికా రాజ్యాంగ 14వ సవరణ స్పష్టంచేస్తున్నది. అమెరికాలో పుట్టినవారం తా దేశ పౌరులేనని ఆ సవరణ అంటున్నది. ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న భారత సంతతి అభ్యర్థి, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్ (డెమోక్రటిక్ పార్టీ) ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను కట్టిపెట్టి దేశ రాజ్యాంగం చదువడంపై ట్రంప్ సీరియస్‌గా దృష్టిసారించాలని ట్వీట్ చేశారు.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles