లోయలో పడ్డ రైలు.. 33 మంది దుర్మరణం


Tue,November 14, 2017 12:36 AM

-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘటన
లుబుంబాసి (డీఆర్ కాంగో): డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ను రవాణా చేస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో రైలులో అక్రమంగా ప్రయాణిస్తున్న సుమారు 33 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగవచ్చని అధికారులు చెప్తున్నారు. లుబుంబాషి నుంచి కటంగాలోని లుయేంగాకు 13 ట్యాంకర్లలో ఆయిల్ రవాణా చేస్తున్న రైలు టుబుడి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి లోయలో పడింది.

212
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS