అన్యాయాలపై గళమెత్తిన మహిళలే

Thu,December 7, 2017 02:20 AM

TIME Person of the Year 2017

పర్సన్ ఆఫ్ ది ఇయర్: టైమ్ మ్యాగజైన్
me-too
న్యూయార్క్: విభిన్న రంగాల్లో లైంగిక వేధింపులు, దాడులను ఎదుర్కొని, ఆ విషయాన్ని ధైర్యంగా వెల్లడించిన మహిళలే ఈ యేటీ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని టైమ్ మ్యాగజైన్ బుధవారం పేర్కొంది. అమెరికాతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ఈ ఏడాది పెద్దఎత్తున ఉద్యమించారు. హాలీవుడ్ సినీ నిర్మాత హార్వే విన్‌స్టెన్‌పై లైంగికదాడి ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం.. వివిధ దేశాలకూ విస్తరించింది. # mee too (నేను కూడా) పేరిట తమపై జరిగిన అన్యాయాలపై మహిళలు గళమెత్తారు. వారందరినీ నిశ్శబ్దాన్ని ఛేదించినవారిగా గుర్తిస్తూ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ర్యాంకింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రన్నరప్‌గా నిలిచారని, ఆ తర్వాతి స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నట్టు పేర్కొన్నది.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS