రెండు హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం

Mon,April 15, 2019 01:41 AM

Three dead in horrific plane crash into helicopter near Mount Everest

-ముగ్గురు మృతి నలుగురికి గాయాలు
-నేపాల్‌లో దుర్ఘటన
కాఠ్మండు, ఏప్రిల్ 14: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం లోని ఎవరెస్ట్ ప్రాంత పరిధిలో ఉన్న లుక్లా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆదివారం ఓ చిన్నపాటి విమానం లుక్లా విమనాశ్రయం నుంచి కాఠ్మండుకు బయలుదేరడానికి సిద్ధమైంది. రన్‌వేపై నుంచి మెల్లగా ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. దీంతో హెలిప్యాడ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్ దుంగనా, ఏఎస్‌ఐ రాం బహదూర్ ఖాద్కా అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలపాలైన ఏఎస్‌ఐ రుద్ర బహదూర్ శ్రేష్ఠ దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగి ఎలాంటి మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles