కాలిఫోర్నియా కార్చిచ్చుకు 15 మంది బలి


Thu,October 12, 2017 12:40 AM

వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా వైన్ సిటీ పరిధిలో వ్యాపించిన కార్చిచ్చు కారణంగా మరణించిన వారిసంఖ్య 15కు చేరుకున్నది.1.15 లక్షల ఎకరాలకు విస్తరించిన అగ్నికీలలతో 2000కు పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. వేలమంది నిర్వాసితులయ్యారు. మంటలను ఆర్పివేసేందుకు 17 ఫైరింజన్లు పనిచేస్తున్నాయి. సొనొమా కౌంటీలో తొమ్మిది మంది, మెండోసినోలో ముగ్గురు, నాపాలో ఇద్దరు, యూబా కౌంటీలో ఒకరు మరణించారు. బాధితుల సహాయం కోసం నిధులు విడుదల చేయాలని దేశాధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ అధికారులను ఆదేశించారు.

149

More News

VIRAL NEWS