ఈ దశాబ్దం చాలా హాట్‌ గురూ!

Wed,December 4, 2019 02:04 AM

మాడ్రిడ్‌: చరిత్రలోనే ఈ దశాబ్దం అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైనదిగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం తెలిపింది. మారుతున్న వాతావరణానికి మానవాళి అలవాటుపడేలోపే అది మరింత వేగంగా మార్పు చెందుతున్నదన్నది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు పూర్వం (1850-1900) నాటి సగటు కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైనాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తెలిపింది. తద్వారా చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మూడేళ్లలో 2019 అగ్రభాగాన నిలిచిందని పేర్కొంది. శిలాజ ఇంధనాల దహనం, మౌలిక వసతుల నిర్మాణం, వ్యవసాయం, సరుకుల రవాణా వంటి మానవ చర్యలతో ఉత్పత్తి అయిన ఉద్గారాలతో 2019, వాతావరణంలో కర్బన సాంద్రతల పెరుగుదల రికార్డును అధిగమించనుందని డబ్ల్యూఎంఓ తెలిపింది.

1076
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles