అర్థశాస్ర్తానికి హరిత సొబగు

Tue,October 9, 2018 01:49 AM

The Nobel Prize in Economics Goes to William Nordhaus and Paul Romer

-అమెరికా ద్వయం విలియం నోర్దాస్, పాల్ రోమర్‌కు నోబెల్
-ఆర్థికాభివృద్ధిని వాతావరణ విధానాల్ని వారు అనుసంధానించారు
-ప్రకృతితో, జ్ఞానంతో మార్కెట్ ఆర్థికవ్యవస్థ ఎలా మమేకమవుతుందో వివరించారు
-నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ ప్రశంసలు
స్టాక్‌హోం, అక్టోబర్ 8: ఆర్థికాభివృద్ధిని వాతావరణ విధానాలను ఎలా అనుసంధానించాలో ప్రపంచానికి తెలియజేసిన అమెరికా ఆర్థికవేత్తల ద్వయం విలియం నోర్దాస్, పాల్‌రోమర్‌లు సంయుక్తంగా ఈ ఏడాది అర్థశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరిద్దరు ఆర్థికవేత్తలు అర్థశాస్ర్తానికి సృజనను, వాతావరణ మార్పుల ఫలితాలను అత్యద్భుతంగా అనుసంధానించారని నోబెల్ ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రశంసించింది. విలియం నోర్దాస్ ప్రస్తుతం అమెరికా యేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా.. ప్రపంచబ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన పాల్ రోమెర్.. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు మన జీవితంలో చాలా మౌలికమైన, కీలకమైన ప్రశ్నలైన దీర్ఘకాలిక నిరంత ర, స్థిరమైన వృద్ధిని ఎలా సృష్టించాలి? అనే అంశాలకు సమాధానాలు చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ కొనియాడింది.

ఈ ఆర్థికవేత్తలు.. ఎవరికి వారు 1990లలో అభివృద్ధిపరిచిన ఆర్థిక నమూనాలు.. ఆర్థిక విశ్లే షణ పరిధిని గుర్తించదగిన స్థాయి లో విస్తృతం చేశాయన్నది. మా ర్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రకృతితో, జ్ఞానంతో ఎలా మమేకమవుతుందో ఈ నమూనాలు వివరిస్తున్నాయని తెలిపింది. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకు వాతావరణ మా ర్పులను అనుసంధానించిన తీరుకు 77 ఏండ్ల నోర్దాస్‌ను కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకు సాంకేతిక ఆవిష్కరణలను అనుసంధానించిన తీరుకు 62 ఏండ్ల రోమెర్‌ను కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. అర్థశాస్త్ర నోబెల్ పోటీలో కొన్నేండ్లుగా ముందు వరుసలో నిలుస్తూ వచ్చిన వీరిద్దరూ ప్రస్తుత సంవత్సరానికి సంయుక్తంగా బహుమతిని సాధించారు. ఈ పురస్కారం కింద అందించే 90 లక్షల స్వీడిష్ క్రోనర్‌లను (రూ.7.31 కోట్లు) ఈ ఆర్థికవేత్తలిద్దరూ పంచుకోనున్నారు. ఇతర రంగాల్లో ఇచ్చే నోబెల్ బహుమతుల మాదిరిగా కాక అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‌ను స్వీడిష్ కేంద్ర బ్యాంకైన రిక్స్‌బ్యాంక్ అందజేస్తుంది. రిక్స్‌బ్యాంక్ 300 ఏండ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా 1968లో అర్థశాస్త్ర నోబెల్‌ను ఏర్పాటు చేసి 1969 నుంచి అందజేస్తున్నది. నోర్దాస్, రోమర్‌లకు నోబెల్‌ను స్టాక్‌హోంలో డిసెంబర్ 10వ తేదీన జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు. అర్థశాస్త్రంలో బహుమతి ప్రకటనతో 2018 నోబెల్ బహుమతుల సీజన్ ముగిసింది.

మన ఆధార్‌నుప్రశంసించిన రోమర్..


aadhaar
2018లో అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు ఆర్థికవేత్తల్లో ఒకరైన పాల్ రోమర్ భారత్‌లో అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ఆధార్ వ్యవస్థను గతంలో ప్రశంసించారు. ఆధార్ అత్యంత అ ధునాతన వ్యవస్థ అని.. ఇటువంటి దాన్ని తానెప్పుడూ చూడలేదని కొనియాడారు. ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా ఉన్నప్పుడు ఆధార్‌పై ఆయన వెల్లడించిన అభిప్రాయాలను ప్రముఖ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బర్గ్ ప్ర చురించింది. ప్రజల గుర్తింపు కోసం ఒక ప్రామాణిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ఉత్తమ విధానమని పరిశోధనలు చెబుతున్నాయి. నేను ఇప్పటివరకు చూసిన వ్యవస్థల్లో భారత్‌లో అమలు చేస్తున్న ఆధార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది అని అన్నారు. ప్రజల డేటాను ప్రైవేట్ సంస్థల వినియోగించడంపై కొంత నియంత్రణ ఉండాలన్నారు.
William-Nordhaus

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS