గూగుల్ ఎర్త్‌లో త్రీడీ దృశ్యాలు


Fri,April 21, 2017 01:30 AM

googlearth
వాషింగ్టన్, ఏప్రిల్ 20: ఇప్పటివరకు మ్యాపింగ్, శాటిలైట్ దృశ్యాలతో అబ్బురపరిచిన గూగుల్ ఎర్త్ తాజాగా త్రీడీ నావిగేషన్‌ను లాంచ్ చేసింది. ఇక మహానగరాల్లోని ఆకాశహర్మ్యాలను, పర్యాటక ప్రదేశాలను, దుర్గమారణ్యాలను, ఎక్కలేని ఎత్తైన పర్వతాలను కూర్చున్న చోటునుంచే నేత్రోత్సవంగా వీక్షించే సౌకర్యం ఈ తాజా అప్‌డేట్ ద్వారా లభించింది. గీజా పిరమిడ్ అయినా, ఢిల్లీ కుతుబ్ మినార్ అయినా హైరిజల్యూషన్‌లో చక్కటి లైటింగ్‌తో, యాంగిల్స్‌తో చూడొచ్చు. దృశ్యాలకు ఇంటరాక్టివ్ కథనాలను కూడా జోడించారు. వెబ్‌లోనూ, మొబైల్‌లోనూ దీనిని లాంచ్ చేశారు. మరోవైపు ఇంట్లోని ఏసీ, లైట్లను ఆపరేట్ చేయడం, ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం వంటి పనులు చేసే గూగుల్ అసిస్టెంట్‌కు వేర్వేరు గొంతులను గుర్తుపట్టే ఫీచర్ తాజాగా వచ్చిచేరింది. ఐదారుగురి గొంతులవరకు ఇది గుర్తుపెట్టుకుని వారికి ప్రత్యేకమైన సేవలను అందిస్తుంది.

730

More News

VIRAL NEWS