ఆర్కిటిక్‌ ద్వీపంలోనే శరభాల అంతం!

Tue,October 8, 2019 02:13 AM

- నిర్ధారించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు


లండన్‌, అక్టోబర్‌ 7: భారీ ఆకారంతో, ఒళ్లంతా ఉన్నితో ఒకప్పుడు జీవించిన శరభాలు (భారీ ఏనుగులు లేదా ఊలీ మమ్మోత్‌లు) చివరగా ఆర్కిటిక్‌ ప్రాంతంలోని రాంగెల్‌ ద్వీపంలో నివసించాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి నాలుగువేల ఏండ్ల కిందట అక్కడే అంతరించిపోయాయన్నారు. ఫిన్లాండ్‌, జర్మనీ, రష్యాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్షిణ సైబీరియా, అలస్కా, ద యుకోన్‌, రాంగెల్‌ ద్వీపం తదితర ప్రాంతాల్లో లభించిన శరభాల ఎముకలు, దంతాల నుంచి కార్బన్‌, నైట్రోజన్‌ అణువులను పరీక్షించి ఈ విషయాలను గుర్తించింది. క్వాంటెర్నరీ సైన్స్‌ రివ్యూస్‌లో ప్రచురితమైన వీరి పరిశోధన వ్యాసం ప్రకారం.. చివరి మంచుయుగంలో అంటే దాదాపు క్రీ.పూ లక్ష-15,000 ఏండ్ల మధ్య కాలంలో శరభాలు ఉత్తర ధ్రువం నుంచి అలస్కా వరకు విస్తరించాయి. 15వేల ఏండ్ల కింద గ్లోబల్‌ వార్మింగ్‌ మొదలై సముద్ర మట్టాలు పెరుగడంతో ఉత్తర సైబీరియా, అలస్కా ప్రాంతాలు నీటమునిగి, వాటి జాతి దాదాపు అంతరించిపోయింది. ఈ పరిణామాలను తట్టుకొని మనుగడ సాగించిన కొన్ని శరభాలు రాంగెల్‌ ద్వీపానికే పరిమితమయ్యాయి. మనుషుల రాక మొదలవడం, కాలుష్యం పెరుగడం, వేట వంటి కారణాల వల్ల వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరగా 4000 ఏండ్ల కిందట వాటి జాతి అంతమైంది. స్థానిక వాతావరణ మార్పుల ఫలితంగానే అవి అంతమైనట్టు పరిశోధకులు వెల్లడించారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles