అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు


Tue,August 22, 2017 03:47 AM

-గంటకు 350 కి.మీ వేగం l వచ్చేనెల 21న ప్రారంభించనున్న చైనా

train
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును చైనా వచ్చేనెల 21న ప్రారంభించనున్నది. దేశ రాజధాని బీజింగ్ నుంచి వాణిజ్యకేంద్రమైన షాంఘై మధ్య నడిచే ఈ రైలు 1,250 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4.5 గంటల్లోనే చేరుకోగలదు. ప్రస్తుతం ఈ రెండునగరాల మధ్య (జమ్ము-భోపాల్ దూరంతో సమానం) ప్రయాణించడానికి ఆరు గంటల సమయం పడుతున్నది. ఈ కొత్త తరం బుల్లెట్ రైలు వల్ల గంటన్నర సమయం ఆదా కానున్నది. ప్రపంచంలో అతివేగంగా నడిచే వాణిజ్య బుల్లెట్ రైలుగా ఇది ఖ్యాతిగడిస్తుందని చైనా రైల్వే కార్పొరేషన్ తెలిపింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి బుల్లెట్ రైలును 2008లోనే బీజింగ్-తియాన్‌జిన్ నగరాల మధ్య చైనా నడిపింది. తర్వాతకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మరోమూడు రైళ్లను కూడా తీసుకొచ్చింది. అయితే, 2011 జూలైలో భారీ రైలు ప్రమాదం జరుగడంతో బుల్లెట్ రైళ్లవేగాన్ని గంటకు 300 నుంచి 250కి తగ్గించింది. అప్పట్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చి ఢీకొనడంతో 40 మంది చనిపోగా, 190 మందికి గాయాలయ్యాయి.

654

More News

VIRAL NEWS