‘అరణ్య’రోదన

Fri,September 20, 2019 02:42 AM

-ఇష్టారాజ్యంగా అడవుల నిర్మూలన
-మూడు దశాబ్దాల్లో 30 లక్షల చ.కి.మీ. మేర ధ్వంసం

మెల్‌బోర్న్: భూమిపై అరణ్యాల విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతున్నది. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచవ్యాప్తంగా శ్రుతిమించిందని.. ఫలితంగా మూడు దశాబ్దాల్లోనే దాదాపు మన దేశంతో సమానమైన వైశాల్యంలో అరణ్యాలను కోల్పోయామని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ, నార్తన్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ సొసైటీ పరిశోధకులు సంయుక్తంగా జరిపిన పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన వీరి పరిశోధన వ్యాసం ప్రకారం.. గత 30 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల చదరపు కి.మీ.ల వైశాల్యం మేర అరణ్యాలు ధ్వంసమయ్యాయి. ఇది మొత్తం అటవీ సంపదలో దాదాపు 10 శాతం. ఇవన్నీ ఒకప్పుడు నిర్జన ప్రదేశాలే. వీటిని సంరక్షించగలిగితే భూమి అంతరించిపోయే ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుతం అమెజాన్ మహారణ్యం, బ్రిటన్‌లోని కొలంబియా అడవులు, ఆస్ట్రేలియాలోని అర్ణ్‌హెమ్ ల్యాండ్ వంటి అరణ్యాలు కీలకంగా ఉన్నాయని, అవి ధ్వంసమైతే జీవవైవిధ్యానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles