కాలిఫోర్నియా కార్చిచ్చుకు 23 మంది మృతి


Fri,October 13, 2017 02:23 AM

బూడిదకుప్పగా మిగిలిన సోనోమాకౌంటీ
Calif-fire
శాంటారోసా(యూఎస్), అక్టోబర్ 12: కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటారోసా కౌంటీలో కార్చిచ్చు వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. అగ్నికీలలకు ఇండ్లు కాలిపోగా 23 మంది మృతి చెందారు. 600మందికిపైగా గల్లంతు కాగా వేల మంది నిరాశ్రయులయ్యారు. మంటలను ఆర్పడానికి 200కు పైగా అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దింపారు. కరువు ప్రాంతమైన శాంటారోసా నగరంలో 1.75 లక్షల మంది నివసిస్తున్నారు. చుట్టుపక్కలున్న అడవుల్లో మంటలు లేచి జనావాసాలకు కూడా వ్యాపించాయి. దాంతో పొరుగున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు శాంటారోసాలోని మద్యం ఉత్పత్తి కేంద్రాలైన సోనోమా, నాపాకౌంటీలు ధ్వంసమయ్యాయి. సోనోమాకౌంటీ బూడిద కుప్పగా మిగిలింది. ఒక్క ఆ ప్రాంతం నుంచే 25 వేలకు పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది భయంకరమైన భారీ ప్రకృతి విపత్తు అని కాలిఫోర్నియా అగ్నిమాపక దళాధిపతి కెన్ పిమ్లోట్ తెలిపారు. ఈ ప్రాంతం మంటల నుంచి తప్పించుకోవడానికి చాలా రోజులు పడుతుందన్నారు. మంగళవారం మొదలైన దావాగ్ని బుధవారం నుంచి మరింత పెద్దదైందని చెప్పారు.

166

More News

VIRAL NEWS