కొనసాగుతున్న డోరియన్‌ బీభత్సం

Sun,September 8, 2019 01:15 AM

The Bahamas death toll is rising as 70,000 residents left homeless by Hurricane Dorian seek food and shelter

- బహామాస్‌లో 43 మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది

నస్సావ్‌ (బహామాస్‌), సెప్టెంబర్‌ 7: బహామాస్‌ దీవుల్లో డోరియన్‌ తుఫాను బీభత్సం కొనసాగుతున్నది. ఇప్పటివరకు 43 మంది మృతిచెందారు. అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. బహామాస్‌ దీవులతో పాటు అబాకో దీవులపై కూడా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నది. డోరియన్‌ ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో ఇండ్లు ధ్వంసమై దాదాపు 70 వేల మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఐక్యరాజ్యసమితి అధికారులు పేర్కొన్నారు. అమెరికా నావికా రక్షణ దళం, ప్రైవేటు సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఇప్పటి వరకు, అమెరికా కూడా ఎదుర్కోనటువంటి భయంకర తుపానును మీరు ఎదుర్కొన్నారు. మేము మీతో ఉన్నాం. కావాల్సిన సాయం చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. నౌకల కంపెనీలు తుఫాను బాధితులకు తాత్కాలిక వసతిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles