గుడ్లు పెడుతున్న బాలుడు!


Fri,February 23, 2018 02:13 AM

-రెండేండ్లుగా 20 గుడ్లు పెట్టిన వైనం
-డాక్టర్లకు సైతం అంతుబట్టని వ్యవహారం

eggboy
జకర్తా, ఫిబ్రవరి 22: కొన్ని సాధారణ ఘటన వార్తలను మనం పెద్దగా పట్టించుకోం. కొన్ని ఘటనలు మాత్రం జనాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. అలాంటి ఘటన ఒకటి ఇండోనేషియాలోని గోవా పట్టణంలో చోటుచేసుకున్నది. ఈ ప్రాంత వాసి అక్మల్ (14) అనే బాలుడు గుడ్లు పెడుతుండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 2016 నుంచి ఇప్పటివర కు దాదాపు 20 గుడ్లు పెట్టినట్టు అక్మల్ తెలిపాడు. మలద్వారం గుండా గుడ్లు వస్తున్నాయన్నాడు. సదరు గుడ్ల ను తెరిచి చూడగా అంతా తెల్లసొన లేదా మొత్తం పచ్చసొనతో ఉంటున్నాయని బాలుడి తండ్రి రుస్లి చెప్పారు. దీంతో బాలుడు తరుచుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల వైద్యుల ఎదుట రెండు గుడ్లను పెట్టాడు. ఈ రెండేండ్లలో తమ కుమారుడు 20 గుడ్ల ను పెట్టాడని.. తొలిసారి పెట్టిన గుడ్డును తెరిచి చూడగా మొత్తం పచ్చసొన మాత్రమే ఉన్నదని రుస్లి చెప్పారు. బాలుడి తీరు వైద్యులకు అంతుబట్టడం లేదు. మానవ శరీరం నుంచి గుడ్లు రావడం అనేది అసాధ్యమని వైద్యులు అంటున్నారు. ఎవరో అక్మల్ మలద్వారంలో గుడ్లను బలవంతంగా పెడుతున్నట్టు అనుమానిస్తున్నామని దీన్ని తాము ప్రత్యక్షంగా చూడలేదన్నారు. వైద్యుల వాదనను రుస్లి ఖండించారు. అక్మల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి వైద్యులు అతడిని షేక్ యూసుఫ్ దవాఖానలో ఉంచారు.

5418

More News

VIRAL NEWS