లైంగికదాడి కేసు నుంచి అసాంజేకు విముక్తి


Sat,May 20, 2017 01:58 AM

julian-assange
-స్వీడన్‌లో కేసు మూసివేత.. అయినా అరెస్టు తప్పదంటున్న బ్రిటన్
స్టాక్‌హోం, మే 19: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే స్వీడన్‌లో తనపై మోపిన లైంగిక దాడి కేసు నుంచి విముక్తుడయ్యారు. బ్రిటన్ మాత్రం బెయిలు షరతులను ఉల్లంఘించినందుకు అసాంజేను అరెస్టు చేసితీరుతామని ప్రకటించింది. 2012లో అరెస్టు వారంటు జారీ అయితే ఆయన దానిని ఖాతరు చేయలేదని బ్రిటిష్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టు తప్పదని అంటున్నారు. అసాంజేపై లైంగికదాడి కేసును ఉపసంహరిస్తున్నట్టు స్వీడిష్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ మరియానేనై శుక్రవారం ప్రకటించారు. అసాంజే బ్రిటిష్, స్వీడిష్ న్యాయవ్యవస్థల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని, ఆయనను పట్టుకోవడం సాధ్యం కాదు గనుక నిబంధనల ప్రకార ం కేసు మూసేస్తున్నామని ఆమె మీడియాకు చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అసాంజే ట్విట్టర్‌లో చిరునవ్వులు చిందిస్తున్న తన ఫొటోను ఎలాంటి కామెంట్ లేకుండా పెట్టారు. ప్రభుత్వాల పత్రభాండాగారాలను కొల్లగొట్టి బట్టబయలు చేసిన అసాంజే అరెస్టును తప్పించుకునేందుకు ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 2012 నుంచి శరణార్థిగా రహస్య జీవితం గడుపుతున్నారు.

307

More News

VIRAL NEWS