మెల్‌బోర్న్‌లో ‘భారత్’ కాన్సులేట్ వద్ద అనుమానాస్పద పార్శిల్

Thu,January 10, 2019 03:09 AM

suspicious Packages Sent To Indian Consulate Other Missions In Australia

మరో 10 విదేశీ కాన్సులేట్ల వద్ద కూడా..
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత్‌తోపాటు పలు ఇతర దౌత్య కార్యాలయాల వద్ద అనుమానాస్పద పార్శిళ్లు లభించాయి. ఈ సంగతి తెలిసిన వెంటనే సంబంధిత దౌత్య కార్యాలయాల నుంచి సిబ్బందిని తరలించి, దర్యాప్తు ప్రారంభించామని ఆస్ట్రేలియా అధికారులు చెప్పా రు. భారత్, అమెరికాలతోపాటు మెల్‌బోర్న్‌లోని 10 విదేశీ దౌత్య కార్యాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ అనుమానాస్పద పార్శిళ్లు దొరకడంతో వాటిని అత్యవసర సర్వీసుల విభాగం పరిశీలిస్తున్నది. అంబులెన్సులు, ఫైరింజన్లు దౌత్య కార్యాలయాల వద్దకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. భారత సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఒక భారత దౌత్యాధికారి తెలిపారు. సిడ్నీలోని అర్జెంటీనా కాన్సులేట్ వద్ద అనుమానాస్పద తెల్లటి పొడి లభించిన రెండు రోజులకు మెల్‌బోర్న్‌లోని విదేశీ దౌత్య కార్యాలయాల వద్ద అనుమానాస్పద పార్శిళ్లు లభించాయి.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles