మాలీలో ఉగ్రదాడి.. ఇద్దరు మృతి


Mon,June 19, 2017 01:09 AM

బమాకో (మాలి), జూన్ 18: మాలీలో జిహాదీలుగా భావిస్తున్న సాయుధ వ్యక్తులు దేశ రాజధాని బామాకోకు తూర్పు ప్రాంతంలోని దౌగౌరాకోరోలోని కంగాబా రిసార్ట్‌పై దాడి చేశారు. రిసార్ట్‌లో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ప్రత్యేక భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. రిసార్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రిసార్ట్ నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని, ఒక భవనం తగులబడుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాయుధులకు, ప్రత్యేక భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలుస్తున్నది. 2015లోనూ ఉగ్రవాదులు.. బామాకోలోని ఒక హోటల్‌పై దాడి చేసి, అందులో ఉన్నవారిని బందీలుగా పట్టుకున్నప్పుడు 20 మంది మరణించారు.

181

More News

VIRAL NEWS