భూటాన్ విదేశాంగమంత్రితో సుష్మాస్వరాజ్ భేటీ


Sat,August 12, 2017 02:41 AM

డోక్లాం ప్రతిష్టంభనపై ప్రత్యేక చర్చ
Sushmaswaraj
ఖాట్మండు: విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ భూటాన్ విదేశాంగశాఖ మంత్రి డాంకో డోర్జీతో శుక్రవారం ఖాట్మండులో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు డోక్లాంలో చైనా, భారత బలగాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై కూడా వారిరువురు చర్చించినట్లు సమాచారం. ఖాట్మండులో జరుగుతున్న బిమ్‌స్టెక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయినట్లు విదేశాంగశాఖ అధికారప్రతినిధి రవీశ్‌కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్) గ్రూపులో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

415

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS